Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ భర్తపై రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు

Rakhi Sawant claims ex husband Adil Khan sold her nude videos for Rs 47 lakh
Advertisement
  • తన న్యూడ్ వీడియోలను దుబాయిలో విక్రయించాడన్న రాఖీ
  • బాత్ రూమ్ లో ఉండగా షూట్ చేశాడని ఆరోపణ
  • ప్రపంచమంతా తనను చూసిన తర్వాత ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్న
Advertisement
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన మాజీ భర్త ఆదిల్ దుర్రానీపై సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లయిన స్వల్ప కాలానికే విభేదాలు రావడంతో వీరు విడిపోవడం తెలిసిందే. ఆదిల్ తన నిధులను దుర్వినియోగం చేశాడని, గృహ హింసకు పాల్పడ్డాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి అతడ్ని జైలుకు కూడా పంపించింది. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదిల్ సైతం రాఖీపై సంచలన ఆరోపణలు చేశాడు.

దీంతో ఆగ్రహించిన రాఖీ సావంత్ మరో అడుగు ముందుకు వేసి.. ఆదిల్ తన న్యూడ్ వీడియోలను రూ.47 లక్షలకు దుబాయిలో విక్రయించాడని ఆరోపించింది. ‘‘నేను బాత్ రూమ్ లో ఉన్నాను. అతడు షూట్ చేశాడు. అలాంటివి బోలెడు వీడియోలు ఉన్నాయి. నా శరీరం మొత్తం న్యూడ్ గా కనిపిస్తోంది. నేను అతడి భార్యను. అతడు నాపై అత్యాచారం చేశాడు.

వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ప్రపంచం అంతా నా వీడియోలను చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లాలి? ప్రపంచానికి నా ముఖాన్ని ఎలా చూపించాలి? నేను సాధారణ అమ్మాయిని కాదు. భారత్ లో సెలబ్రిటీని. విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలా?’’ అంటూ రాఖీ సావంత్ వాపోయింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 7న రాఖీ సావంత్ ఫిర్యాదు మేరకు ఆదిల్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయగా, అతడు ఇటీవలే విడుదలయ్యాడు. ఓ న్యూస్ పోర్టల్ తో మాట్లాడుతూ రాఖీపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు.
Advertisement
Advertisement
Rakhi Sawant
Adil Khan
** videos
allegations

More Telugu News